పులివెందులలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

Published Sun, Dec 21 2014 10:48 AM

YS Jagan mohan reddy birthday celebrations in pulivendula

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకులు ఆదివారం పులివెందులలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎత్తున హాజరయ్యారు.

అనంతరం లింగాలలో రక్తదాన శిబిరాన్ని అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో మున్సిపల్ మాజీ చైర్మన్ రుక్మిణిదేవి రోగులకు పండ్లు పంచిపెట్టారు.

అలాగే జిల్లాలోని రైల్వే కోడూరు డాల్ఫిన్ స్కూల్లో వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు బ్రహ్మానందరెడ్డితో పాలు పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విశాఖపట్నం జిల్లా : వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు గాజువాకలో జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గ ఇంఛార్జ్ తిప్పల నాగిరెడ్డి కేక్ కేట్ చేశారు. అనంతరం సింహాద్రి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.  
అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నేత బుల్లిబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
విశాఖపట్నంలోని శాంతి ఆశ్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేత కాంతారావు సారథ్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణి చేశారు.
అలాగే మునగపాకలో అరకు పార్లమెంట్ ఇంఛార్జ్ బుడేటి ప్రసాద్ ఆధ్వర్యంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకులు ఘనంగా జరిగాయి.

చిత్తురూ జిల్లా: శ్రీకాళహస్తీలో వైఎస్ఆర్ సీపీ నేత వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

Advertisement
Advertisement