44వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

44వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

Published Tue, Dec 26 2017 7:54 PM

ys jagan mohan reddy prajasankalpayatra completes 44th day - Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు ముగిసింది. నేటి(మంగళవారం) ఉదయం కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో వైఎస్‌ జగన్‌ 44వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా 10 గంటలకు గాజులవారిపల్లెకు చేరుకుంది. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌.పి కుంట మండలంలోని ధనియని చెరువులో వైఎస్ జగన్ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ధనియని చెరువులో మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డి కొత్తపల్లి, కొట్టాలవారిపేట మీదుగా సాగిన పాదయాత్ర 5 గంటలకు బండారుచెట్లుపల్లికి చేరుకుంది. వెంకమద్ది క్రాస్ లో 44వ రోజు పాదయాత్ర ముగిసింది. జననేత వైఎస్ జగన్ రాత్రి ఇక్కడే బస చేస్తారు. నేడు వైఎస్‌ జగన్‌ 15.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు.
 

Advertisement
Advertisement