18న వైఎస్ జగన్ పుష్కర స్నానం | Sakshi
Sakshi News home page

18న వైఎస్ జగన్ పుష్కర స్నానం

Published Fri, Aug 12 2016 3:20 PM

18న వైఎస్ జగన్ పుష్కర స్నానం - Sakshi

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement