నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష | Sakshi
Sakshi News home page

నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష

Published Wed, Aug 28 2013 8:12 AM

నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష - Sakshi

హైదరాబాద్ : రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్తో కడప ఎంపి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. నిర్బంధంలో ఉన్నా జనం కోసం దీక్ష చేపట్టిన జగన్కు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది.

ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎదుర్కొంటూ కూడా ప్రజల కోసం జైలు నుంచి వైఎస్‌ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజలంతా సంఘీభావం తెలుపుతున్నారు.  నిన్నఆయనకు జైలు వైద్యులు మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, పల్స్ రేట్ కు సంబంధించిన పరీక్షలు జరిపారు. ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం మూడు సార్లు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసిన ప్రకటనలో  జైలు అధికారులు తెలిపారు.

వరుసగా మూడు రోజుల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో వైఎస్ జగన్ కొద్దిగా నీరసంగా ఉన్నట్లుగా సమాచారం.  జైలు అధికారులు ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా జగన్ ఆ విజ్ఞప్తులను సున్నితంగా తిరస్కరించారు. దీంతో జగన్ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉండటంతో రాత్రి సమయంలో కూడా వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేలా జైలు అధికారులు ఏర్పాటు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement