జగనన్నకు ఘనస్వాగతం పలకాలి | Sakshi
Sakshi News home page

జగనన్నకు ఘనస్వాగతం పలకాలి

Published Sat, Aug 4 2018 12:36 PM

YS Jagan Praja Sankalpa Yatra Entry In Visakhapatnam This Second Week - Sakshi

విశాఖపట్నం  ,నాతవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల రెండోవారంలో జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఘనస్వాగతం పలకాలని పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం కో–ఆర్డినేటర్‌ వరుదు కల్యాణి సూచించారు. నాతవరంలో పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి నూకరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డికి ఉత్సాహంగా స్వాగతం పలకాలన్నారు. పాదయాత్ర జరిగే దారి పొడవునా నవరత్నపథకాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.

పండగలా సాగాలి..
రాష్ట్రంలో ఇంతవరకు పది జిల్లోల్లో జరిగిన ప్రజా సంకల్పయాత్రను మైమరిపించేలా పండగ వాతావరణాన్ని మన నాయకుడికి స్వాగతం పలకాలని నర్సీపట్నం నియోజకవర్గం కన్వీనర్‌ పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ అన్నారు. ఆయనతో నడిచేందుకు యువకులు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం పెడుతున్న కష్టాలను జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పుకోవడానికి వచ్చే అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. మండలంలో ఉత్సాహంగా ఉన్న  ఐదుగురు వ్యక్తులను ప్రజా సంకల్ప యాత్ర కమిటీ సభ్యులుగా నియమించారు.

ఏర్పాట్ల పరిశీలన
జిల్లా సరిహద్దులో జరుగుతున్న ఏర్పాట్లను వరుదు కల్యాణి పరిశీలించారు. స్వాగత సన్నాహాలపై గణేష్‌ ఆమెకు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వహక కమి టీ సభ్యులు అంకంరెడ్డి జమీలు, నర్సీపట్నం మాకవరపాలెం మండల శాఖ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, రుత్తల సత్యనారాయణ, జిల్లా  కమిటీ సభ్యులు పైల పోతురాజు, సబ్బవరపు వెంకునాయుడు ,శిరుసుపల్లి శేఖర్, పైల సునిల్, వర్రే పాత్రుడు, శెట్టి మోహన్, వేమల సూరి బా బు, కొండ్రు అప్పారావు, మండల యూత్‌ అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, బీసీ సెల్‌ మం డల అధ్యక్షుడు గొర్లె వరహాలబాబు, మహిళా మం డల శాఖ అధ్యక్షురాలు కామిరెడ్డి లక్ష్మి, యూత్‌ జిల్లా కమిటీ సభ్యులు సిద్ధాబత్తుల వెంకటరమణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement