195వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

195వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

Published Wed, Jun 20 2018 7:44 PM

YS Jagan Prajasankalpayatra 195Th Schedule Released - Sakshi

సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం రాజోలు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లక్కవరం క్రాస్‌ మీదుగా చింతలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 194వ రోజు ప్రజాసంకల్పయాత్రను బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా నాగుల్లంక శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చాకలిపాలెం, తాటిపాక మఠం, పొదలాడ మీదుగా రాజోలు వరకు పాదయాత్ర  కొనసాగింది. పాదయాత్రలో భాగంగా జననేత  ఇవాళ 9.9 కిలోమీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు 2,398.9 కిలోమీటర్లు నడిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement