ప్రజాసంకల్పయాత్ర 124వ రోజు షెడ్యూల్ | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 124వ రోజు షెడ్యూల్

Published Thu, Mar 29 2018 7:39 PM

YS Jagan PrajaSankalpaYatra Ends On 123 Day - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 124వ రోజు షెడ్యూలు ఖరారు అయింది. శుక్రవారం ఉదయం పెదకూరపాడు నైట్ క్యాంప్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. పాటిబండ్లకు చేరుకున్నాక అక్కడ పార్టీ జెండా అవిష్కరిస్తారు. ముస్సాపురంలోనూ ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. పొడపాడులో లంచ్ విరామం తీసుకుంటారు. 2:45 గంటలకు భోజనం విరామం అనంతరం పాదయాత్ర కొనసాగించనున్న వైఎస్ జగన్ తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం సిరిపురం మీదుగా సరిపుడి చేరుకుంటారు. శుక్రవారం రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

123వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 123వ రోజు గురువారం ముగిసింది. నేటి ఉదయం గుడిపూడి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. పెదకూరపాడులో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై నిప్పులు చెరిగారు. పులిచింతలపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కొనియాడారు. పెదకూరపాడులోనే 123వ రోజు పాదయాత్ర ముగిసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement