ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్‌సీపీ ప్రచార దళం | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్‌సీపీ ప్రచార దళం

Published Fri, Mar 7 2014 1:47 AM

Ysr congress party campaign committee for Election campaign

సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూళ్లు వెలువడిన నేపథ్యంలో ప్రచారానికి వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ నడుం బిగించింది. కమిటీ కోఆర్డినేటర్ విజయచందర్ ఆధ్వర్యంలో ఒక దళం గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రచారానికి బయలుదేరింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డి.ఎ.సోమయాజులు ప్రచారదళం వాహనానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్, ఎస్.సి విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement