Sakshi News home page

సర్కారును ముల్లుగర్రతో పొడవాలి

Published Fri, Nov 28 2014 12:47 AM

YSR Congress three member committee members takes on tdp government

వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ పిలుపు
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజా వ్యతిరేక చర్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ముల్లుగర్ర తో పొడిస్తే కానీ స్పందించదని.. డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం సమీపాన ఆర్‌కే టౌన్‌షిప్‌లో జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాల ఆర్థిక పరి స్థితులు ఎలా ఉంటాయో చంద్రబాబుకు తెలి యదా? అని సీఎంపై ధ్వజ మెత్తారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి ప్రజలకూ వెన్నుపోటు పొడిచారని వైఎ స్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా సెల్వమణి విమర్శించారు.

పిల్ వేస్తాం: విజయసాయిరెడ్డి
ప్రజా వ్యతిరేకంగా చంద్రబాబు జారీ  చేస్తున్న జీవోలపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ జి ల్లా స్థాయి విస్తృత సమావేశం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పరిశీలన, ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణ లబ్ధిదారుల ఎంపిక కమిటీల కోసమని రూపొందిం చిన 135, 101 జీవోల మాటున టీడీపీ కార్యకర్తలందరినీ కమిటీల్లో వేసి తమకు నచ్చినోళ్లకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్న బాబుపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు.

Advertisement
Advertisement