‘తెలంగాణ’ ఏర్పాటులో వైఎస్‌ది కీలక పాత్ర | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ ఏర్పాటులో వైఎస్‌ది కీలక పాత్ర

Published Sat, Aug 31 2013 4:29 AM

YSR key person of telagana state formation

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిదే కీలకపాత్ర అని... ఆయన కల నెరవేరిందనే విషయాన్ని దిగ్విజయ్‌సింగ్ పలు మార్లు ఉదహరించిన విషయాన్ని తెలంగాణవాదులు, ప్రజలు ఓసారి గుర్తుకు చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త తక్కళ్లపెల్లి రాము సూచించారు. హంటర్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం అర్బన్ కన్వీనర్ తుమికి రమేష్‌బాబు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన మహా నేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అవివేకమని... ఈ సంఘటన హేయనీయమన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటు కావడానికి వైఎస్ చేసిన కృషిని సుమారు 45 నిమిషాలపాటు వివరించారు. రాజన్న పాలనలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం టి.రమేష్‌బా బు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తేదీన జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజశేఖరరెడ్డికి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా అభిమానులున్నారని పేర్కొన్నారు.

విగ్రహాలను ధ్వంసం చేయడం తెలంగాణ సంస్కృతి కాదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమం చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి అని కొనియూడారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు బొజ్జపెల్లి రాజయ్య, ముత్తినేని సోమేశ్వర్‌రావు, చేవూరి చిరంజీవి, మాజీ డిప్యూటీ మేయర్ టి.అశోక్‌రావు, బీరం సంజీవరెడ్డి, నాడెం శాంతికుమార్, లక్కిరెడ్డి పూర్ణేందర్‌రెడ్డి, చిల్లి ఇంద్రసేనారెడ్డి, జనగాం రమేష్, కన్నోజు జలేందర్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, అర్బన్ మైనార్టీ నాయకుడు ఖాజామన్సూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement