వైఎస్సార్‌సీపీలో పలువురి నియామకం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురి నియామకం

Published Fri, Jul 10 2015 1:28 AM

YSRCP

పట్నంబజారు(గుంటూరు) :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు చెందిన పలువురిని పార్టీకి చెందిన పలు విభాగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  బాపట్లకు చెందిన వడ్డెముక్కల డేవిడ్‌ను ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కార్యదర్శులుగా మండే విజయ్‌కుమార్, ఇ.ప్రేమ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా మంగళగిరికి చెందిన లాం చిన్నారిని నియమించారు. యువజన విభాగం కార్యదర్శులుగా వీరభధ్ర శ్రీనివాసరెడ్డి, ఏటుకూరి విజయసారధి నియమితులయ్యారు.
 
  సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అక్కల శ్రీనివాసరెడ్డిని, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మరుప్రోలు శివారెడ్డి, ప్రచారకమిటీ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తారపు పిచ్చియ్యశాస్త్రి, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షస్త్రక్ అహ్మద్ హుస్సేన్ నియమితులయ్యారు. పార్టీ ప్రచారకమిటీ జిల్లా అధ్యక్షుడిగా తాడికొండకు చెందిన ఆళ్ళ బసవపూర్ణచంద్రరావు నియమితులయ్యారు. సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గురజాలకు చెందిన షేక్ ఎస్‌వలి, కార్యదర్శులుగా కాలే మాణిక్యరావు, కంచర్ల వెంకయ్య, సహాయ కార్యదర్శులుగా డి. జార్జి, గంధం నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆవుల నర్సిరెడ్డి నియమితులయ్యారు. పార్టీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఈ. డేవిడ్‌రాజు, కంచేటి కుచేలరావు, సహాయ కార్యదర్శులుగా తోట శ్రీనివాసరావు, మొహమ్మద్ ఇక్బాల్, బి.సాంబిరెడ్డి, ఎస్ శివనాగేశ్వరరావు, ఇ.ఆదాం, షేక్ మస్తాన్‌వలి నియమితులయ్యారు. ఎస్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బాణావత దేవదాసునాయక్, బాణావత్ కృష్ణానాయక్ ,కావటి ప్రసాద్, కార్యదర్శిగా దాసరి పెద్దలక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా కండ్రకుంట కన్నయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎస్.హనుమంత్‌నాయక్  నియమితులయ్యారు.
 
 ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా సంకూరి మరియబాబు, బాసిపోగు రాంబాబు, కార్యదర్శులుగా కనపాల విజయ్‌ప్రతాప్, బత్తుల చంద్రయ్య, సహాయ కార్యదర్శులుగా బొనిగల డేవిడ్‌రాజు, కె. విక్టర్‌కళ్యాణ్‌రావు, కొండెపాటి సింగారావు, మామిడి ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కటికల యెహోశౌరి, కొమ్ము ముక్కొటి, దార్ల శ్రీనివాసరావు నియమితులయ్యారు. యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ఉయ్యూరు వెంకటరెడ్డి, గుంటూరు సుషేంద్రకుమార్, మిర్యాల రాంబాబు, డి. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా టి. వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు.
 
 పార్టీ మండల అధ్యక్షులు
 బాపట్ల రూరల్- కె.వీరరాఘవస్వామిరెడ్డి, బాపట్ల టౌన్-నరాలశెట్టి ప్రకాశరావు, కర్లపాలెం-దొంతిబోయిన సీతారామిరెడ్డి, పిట్టలవానిపాలెం-షేక్ బాజీ, సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ- ఇందూరి నరసింహారెడ్డి, మంగళగిరి నియోజకవర్గం టౌన్- మునగాల మల్లేశ్వరరావు, రూరల్-మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి టౌన్- బి.వేణుగోపాలస్వామిరెడ్డి, రూరల్-పాటిబండ్ల కృష్ణమూర్తి, దుగ్గిరాల- నల్లగుర్ల కోటేశ్వరరావు, రేపల్లె నియోజకవర్గం రేపల్లె టౌన్- గడ్డం కృష్ణ, రూరల్-గాదె వెంకయ్యబాబు, నగరం- చెన్నకేశవులు, చెరుకుపల్లి- పి.వేమారెడ్డి నియమితులయ్యారు.
 
 మండల బీసీ అధ్యక్షులు : వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం- మోర్గ వేణు, భట్టిప్రోలు-చందోలు రవికుమార్, కొల్లూరు- మోదుకూరి చరణ్‌సింగ్, పిడుగురాళ్ళ టౌన్- కొమ్మెర వెంకటేశ్వర్లు, రూరల్- కె. లక్ష్మయ్య, మాచవరం- శివరాత్రి వెంకటస్వామి, దాచేపల్లి- బత్తుల బాలయ్య, గురజాల- బత్తుల తిమ్మరాజు నియమితులయ్యారు.
 మహిళా విభాగం మండల అధ్యక్షులు :గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ టౌన్- ఎం.కోటివీనమ్మ, రూరల్-పి. విజయలక్ష్మి, మాచవరం-షేక్ మీరాబి, దాచేపల్లి- షేక్ హుస్సేన్‌బీ, గురజాల- గంగిరెడ్డి రామకోటమ్మ
 సేవాదళ్ మండల అధ్యక్షులు : సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ- నల్లపునేని రమేష్, మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి టౌన్-ఎస్. శ్రీను, రూరల్-గోపి, తాడేపల్లి టౌన్- కె. రమేష్, రూరల్- గడ్డం తాతారావు, దుగ్గిరాల- పసుపులేటి సాయిబాబు, తెనాలి నియోజకవర్గం కొల్లిపర- తాతా సతీష్‌కుమార్.  ఎస్సీ విభాగం మండల అధ్యక్షులుగా మంగళగిరి టౌన్‌కు బెజ్జం రాజయ్య, రూరల్‌కు ఈపూరి రవి, తాడేపల్లి టౌన్‌కు ముదికొండ ప్రకాష్, రూరల్‌కు పచ్చల విజయకుమార్, దుగ్గిరాలకు సుగరపాటి రత్నం నియమితులయ్యారు. ఎస్టీ విభాగం మండల అధ్యక్షులుగా కొల్లిపరకు కట్టా ప్రభాకర్‌ను నియమించారు.
 
   యువజన విభాగం మండలాధ్యక్షులుగా మేడికొండూరుకు కొండవీటి జానీబాషా, ఫిరంగిపురానికి తియ్యగూర అంజిరెడ్డి, వేమూరుకు గుమ్మడి డానియేల్, అమర్తలూరుకు కొల్లపూడి అశోక్‌కుమార్, కొల్లూరుకు సింగం కృష్ణప్రసాద్, భట్టిప్రోలుకు బొట్టు సురేష్‌బాబు, చుండూరుకు రాయల సురేష్‌కుమార్, భట్టిప్రోలు టౌన్‌కు చేబ్రోలు నాగార్జున, మంగళగిరి టౌన్‌కు ఆకురాతి రమేష్, రూరల్‌కు అజయ్, తాడేపల్లి టౌన్‌కు తుమ్మలపూడి మహేష్‌రెడ్డి, రూరల్‌కు మున్నంగి వివేకానందరెడ్డి, దుగ్గిరాలకు బర్మా అర్జునరావు నియమితులయ్యారు.
 

Advertisement
Advertisement