వికలాంగుల సంక్షేమానికి కృషి: ఎస్వీ | Sakshi
Sakshi News home page

వికలాంగుల సంక్షేమానికి కృషి: ఎస్వీ

Published Sun, Mar 16 2014 12:36 AM

వికలాంగుల సంక్షేమానికి కృషి: ఎస్వీ - Sakshi

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన నగరంలోని 11వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎస్వీకి ఘనంగా స్వాగతం పలికారు.
 
అనంతరం ఎస్వీ మోహన్‌రెడ్డి వార్డులోని ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా పలకరించి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తన హయాంలో వికలాంగుల పింఛన్‌ను రూ. 500కు పెంచి అన్ని విధాలా చేయూతనిచ్చారన్నారు.
 
ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన వెంటనేపింఛన్‌ను రూ. 1000కి పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేస్తే వికలాంగులతోపాటు అన్ని వర్గాల సమస్యలన్నీ తీరిపోతాయని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జిల్లా విభాగం కన్వీనర్ కిషన్, నాయకులు డిష్ శ్రీను, మహబూబ్‌అలీ, రిజ్వాన్, సుభాన్, మధు, భాస్కర్, వీరన్న, సంపత్, శేఖర్, వీరేశ్, కృష్ణమూర్తి, ఆనంద్, అజయ్, చాంద్‌బాషా, కళావతి, జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement