వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం

Published Tue, Apr 8 2014 2:37 AM

వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం - Sakshi

జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసి ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం పట్టారని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సామినేని విశ్వనాథం స్పష్టం చేశారు.

 సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిశ్చేష్టులను చేస్తూ  అవాక్కయ్యే విధంగా ఫలితాలు రాబోతున్నాయన్నారు.గ్రామాల్లో ఎక్కువ శాతం పోలైన ఓట్ల సరళిని బట్టి ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని స్పష్టమవుతుందన్నారు.

నియోజకవర్గంలో ఉన్న మొత్తం 60 ఎంపీటీసీ స్థానాల్లో 40 పైచిలుకు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయఢంకా  మోగిస్తారని  ధీమా వ్యక్తం చేశారు. అలాగే మూడు ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు కైవసం చేసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు గానూ 20కు పైగా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయవిహారం చేస్తారని చెప్పారు.
 
పార్జీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఆధిక్యత సాధిస్తుందని స్పష్టంగా కనపడుతుందన్నారు.  రేపటి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా ఉన్న ఈ ఎన్నికల ఓటింగ్ సరళి వలన పార్టీ శ్రేణులు రెట్టించిన సమరోత్సాహంతో  ఉదయభానును అఖండమెజార్టీతో గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల చలం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన  కాంగ్రెస్, తెలుగుదేశం, బీజే పీలు  రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని వాళ్లకు బుద్ధిచె ప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
 
పార్టీ పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్ మాట్లాడుతూ చంద్రబాబు బీజే పీతో పొత్తుపెట్టుకుని తన నెత్తిన తానే నిప్పులు పోసుకుంటున్నాడని, ముస్లింలకు మరలా అన్యాయం చేయనని, బీజేపీతో పొత్తుపెట్టుకోనని  ప్రగల్భాలు పలికి... నేడు మాట మార్చిన పచ్చి అవకాశవాదని, అయనకు వచ్చే ఎన్నికల్లో ముస్లింలు తగిన మర్యాద చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
 
జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకావీరంజనేయులు, జె. ఉదయబాస్కర్, నంబూరి రవి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్, కొలగాని వెంకయ్య, పొన్నా రామ్మోహన్, పట్టణ యూత్‌కన్వీనర్ రాంబాబు,  సీనియర్ నాయకులు గంటా హనుమంతరావు, తుమ్మేపల్లి గోపాలరావు, మాదిరాజు కేశవరావు, మైనార్టీ నాయకులు అమీర్‌భీ, ఖాజామొహిద్దీన్, జాన్‌బాషా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement