వైఎస్‌ వివేకా హత్య : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకానంద హత్య : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Published Sat, Mar 16 2019 12:36 PM

YSRCP Leaders Protest Against YS Vivekananda Reddy Murder - Sakshi

సాక్షి, అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను ఖండిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగాయి. రాజకీయ హత్యలను నిరసిస్తూ నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్లజెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి నిరసను తెలియజేస్తున్నారు. (వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి)

తిరుపతిలో 
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను ఖండిస్తూ తిరుపతిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. గాంధీ విగ్రహం ఎదుట భూమన కరుణాకర్‌ రెడ్డి నేతృత్వంలోలో నల్ల జెండాలు చేపట్టి నిరసన తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ముమ్మాటికి టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ హత్యపై సీబీఐ చే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు ఎస్‌ బాబు, అన్నారామచంద్రా, రాజేంద్ర, ఇమామ్, బొమ్మకుంటా రవి, ముద్ర నారాయణ. గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో..
రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలను ఖండిస్తూ, పెదవాల్తే రూ జంక్షన్ లో వై ఎస్సార్‌సీపీ తూర్పు ఇన్ ఛార్జ్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో  నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్  పేర్ల విజయ చందర్,బిసి సంఘం నేత రామన్న పాత్రుడు, ఎస్సీ సంఘం నేత బోనీ శివరామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు కృప, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బాపట్లలో 
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఖండిస్తూ బాపట్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం వరకు కోన రఘుపతి నేతృత్వంలో నల్ల జెండాలు చేపట్టి నిరసన తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య మీద సిబిఐ చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో 
రాయదుర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ దివంగత  వైఎస్ వివేకానందరెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంతకల్లులో నల్లజెండాలతో శాంతి ర్యాలీ చేపట్టారు. 

విజయనగరంలో 
వైఎస్‌. వివేకనందా రెడ్డి హత్యను ఖండిస్తూ పూసపాటిరేగమండలం కందివసలో మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ఆద్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి జాతిపిత  మహాత్మాగాంధీ కి వినతిపత్రాన్ని సమర్పించి శాంతియుతంగా నిరసన తెలియజేసారు.

ప్రకాశంలో
వైఎస్సార్‌సీపీ జిల్లా ఇంచార్జ్‌ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొండపి వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త డా. మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అద్దంకి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గరటయ్య ఆధ్వర్యంలో ఆంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసనకు దిగారు అజాత శత్రువు, సౌమ్యుడైన వివేకానందరెడ్డిని చంపడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికి టీడీపీ హత్యేనన్నారు. రాజకీయంగా వైఎస్‌ జగన్‌ చొచ్చుకొని పోతున్న సమయంలో ఓర్చుకోలేక ఆయన కుటుంబంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి  హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని వైస్సార్‌సీపీ నాయకులతో పాటు అవనిగడ్డ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ కోసం చంద్రబాబు వేసిన సిట్ పై నమ్మకం లేదని, సిబిఐ చే విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. హత్య వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ అవనిగడ్డలో నిరసన ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో
వైఎస్ వివేకానంద హత్యకు నిరసనగా దేవరపల్లి లో గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట రావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కె. దుర్గారావు, రాజేంద్ర బాబు, రాజబాబు సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement