ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే.. | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే..

Published Sat, Jul 30 2016 4:00 PM

ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే.. - Sakshi

హైదరాబాద్: విజయవాడలో వైఎస్సాఆర్ విగ్రహం తొలగింపుపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి పార్థసారథిలు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గపు చర్య అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని చేయకపోతే తామే విగ్రహాన్ని తిరగి ఏర్పాటు చేస్తామని అన్నారు.  మహానేత వైఎస్ఆర్ ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారని, పులిచింతల ప్రాజెక్టుకు చిహ్నమే వైఎస్ఆర్ విగ్రహం అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. వైఎస్ విగ్రహాలంటే చంద్రబాబుకు అసహనంగా ఉందని, సంస్కారహీనంగా మహానేత విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారని పార్థసారధి అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం తర్వాతే వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబువన్నీ విధ్వంసకర ఆలోచనలని విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పటమట, పామర్రులో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వైఎస్ విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దని నిబంధనలు ప్రకారం వ్యవహరించాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement