వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట

Published Sat, Sep 6 2014 3:19 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట - Sakshi

  • కేంద్రపాలక మండలి సభ్యులుగా ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
  •  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  •  అధికార ప్రతినిధులుగా ఆర్‌కే.రోజా, భూమన
  • సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు మరోసారి పెద్దపీట వేశారు. కేంద్ర పాలకమండలి సభ్యులుగా తిరుపతి ఎంపీ వరప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డిని నియమించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అధికార ప్రతినిధులుగా ఆర్‌కే.రోజా, భూమన కరుణాకరరెడ్డిని నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కమిటీలోనూ జిల్లాకు అధిక ప్రాధాన్యత కల్పించారు.

    మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను నియమించారు. అలాగే కార్యద ర్శిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి పార్టీ తరపున ఇద్దరు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు.
     

Advertisement
Advertisement