గ్రహం అనుగ్రహం (20-08-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (20-08-2019)

Published Tue, Aug 20 2019 7:38 AM

Daily Horoscope in Telugu (20-08-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.పంచమి రా.1.29 వరకు, తదుపరి షష్ఠినక్షత్రం రేవతి రా.8.01 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.6.54 నుంచి 8.37 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.06 వరకుతదుపరి రా.10.55 నుంచి 11.41 వరకు, అమృతఘడియలు... సా.5.23 నుంచి 7.08 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. దైవదర్శనాలు.
కర్కాటకం:చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
సింహం:కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కన్య: కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. శ్రమ తప్పకపోవచ్చు.
ధనుస్సు:ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
కుంభం: పనుల్లో  స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. నిరుద్యోగులకు గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.
మీనం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement