గ్రహం అనుగ్రహం (23-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (23-06-2020)

Published Tue, Jun 23 2020 5:58 AM

Daily Horoscope in Telugu (23-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.విదియ ఉ.11.10 వర కు, తదుపరి తదియ నక్షత్రం పునర్వసు ప.1.59 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం రా.9.53
నుంచి 11.27 వరకు, దుర్ముహూర్తం ఉ.8.05 నుంచి 8.57 వరకు తదుపరి రా.10.55 నుంచి 11.38 వరకు అమృతఘడియలు... ప.11.32 నుంచి 1.10 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

గ్రహఫలం
మేషం:ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. స్థిరాస్తి ఒప్పందాలు. ధనలబ్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఊహించిన విధంగా కొనసాగుతాయి.

తుల: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కుంభం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. పనుల్లో ఆటంకాలు. ఖర్చులు అ«ధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement