గ్రహం అనుగ్రహం (25-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (25-05-2020)

Published Mon, May 25 2020 6:13 AM

Daily Horoscope in Telugu (25-05-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠ మాసం. తిథి శు.తదియ రా.11.57 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆరుద్ర పూర్తి (24 గంటలు). వర్జ్యం ప.2.04 నుంచి 3.42 వరకు. దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.14 వరకు, తిరిగి ప.2.56 నుంచి 3.48 వరకు.అమృత ఘడియలు రా.7.44 నుంచి 9.22 వరకు. రోహిణి కార్తె ప్రారంభం.
సూర్యోదయం: 5.30 సూర్యాస్తమయం: 6.23; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం: పనులలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. దైవదర్శనాలు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం:మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

మిథునం:కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం:పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో చికాకులు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

వృశ్చికం: పనులలో జాప్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: జీవితాశయం నెరవేరుతుంది. దైవదర్శనాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: ఆర్థిక విషయాలు అంతంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

Advertisement
Advertisement