Sakshi News home page

గ్రహం అనుగ్రహం (26-06-2020)

Published Fri, Jun 26 2020 5:59 AM

Daily Horoscope in Telugu (26-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి శు.పంచమి ఉ.7.03 వరకు, తదుపరి షష్ఠి తె.4.55 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం మఖ ఉ.11.55 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం రా.7.30 నుంచి 9.02 వరకు, దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.58 వరకు, తదుపరి ప.12.27 నుంచి 1.20 వరకు, అమృతఘడియలు... ఉ.9.36 నుంచి 11.03 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

వృషభం: ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

మిథునం: పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలత. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు రాగలవు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత రాణిస్తాయి.

మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల సలహాలు పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

Advertisement
Advertisement