గ్రహం అనుగ్రహం (29-02-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (29-02-2020)

Published Sat, Feb 29 2020 6:37 AM

Daily Horoscope in Telugu (29-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.షష్ఠి పూర్తి (24 గంటలు)నక్షత్రం భరణి రా.3.11 వరకు, తదుపరి కృత్తికవర్జ్యం ప.11.31 నుంచి 1.14 వరకు
దుర్ముహూర్తం ఉ.6.23 నుంచి 7.55 వరకుఅమృతఘడియలు... రా.9.56 నుంచి 11.40 వరకు.

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: నూతన ఉద్యోగాలలో ప్రవేశం. పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. వస్తు,వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

తుల: శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ది.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

ధనుస్సు: పనులలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.

మకరం: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. పనులు వాయిదా.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. కొత్త పనులు చేపడతారు. విచిత్ర సంఘటనలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. ఆలయ దర్శనాలు.

మీనం: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement