సమస్యను పరిష్కరించేదెవరు? | Sakshi
Sakshi News home page

సమస్యను పరిష్కరించేదెవరు?

Published Mon, Feb 5 2018 4:52 PM

people were gone to high court for justice - Sakshi

మణుగూరుటౌన్‌ : మణుగూరు సింగరేణి ఏరియా ఓసీ ప్రాజెక్‌ట కింద యగ్గడిగూడెం, మల్లేపల్లి, కొండాపురం, మణుగూరు గ్రామాల ప్రజల నుండి సుమారుగా 695 ఎకరాల భూమిని సేకరించి కలెక్టర్‌ 2016 సంవత్సరంలో సింగరేణి యాజమాన్యానికి అప్పజెప్పారు. దీనికి గాను ప్రభుత్వ లెక్కల ప్రకారం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి 24 కోట్ల రూపాయలను చెల్లించింది. దాదాపుగా ఇందులో 495 ఎకరాలకు ప్రభుత్యం పరిహారం చెల్లించింది. కానీ ఇందులో 24 ఎకరాల 29 గుంటలకు సంబందించి కేసులలో పెండింగ్‌లో ఉండగా, 23 ఎకరాల 24 గుంటలకు సంబందించి నిర్వాసితులు తమను ఎవరు సంప్రదించకుండా, పరిహారం చెల్లించకుండా ఓసీ పనులు నిర్వహిస్తున్నారని అన్నారు.  

దీంతో వారు పలుమార్లు ఓసీ వద్దకు వెళ్లి ఓబీ పనులను అడ్డుకున్నారు. వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో దొబ్బల నర్సింహారావు, సీతమ్మ, వెంకటప్పయ్య, మంగమ్మ, ప్రమీల, కొప్పుల వాసు, ఈరెళ్ళి కోటయ్యలు హైకోర్టును ఆశ్రయించారు.  సర్వేనెం 376ఏఏ1, 2, 387ఏ, 502–1412ఏఏ, ఈ సంబందించి సుమారు 23 ఎకరాల 24 గుంటలలో ఎటువంటి ఓసి పనులు నిర్వహించరాదని 6 వారాలలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని 7 శాఖల అధికారులకు హైకోర్టు షాకోజు నోటీసులు జారీ చేసింది.   ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం మణుగూరు తహసీల్దార్‌ నిర్వాసితలను, సింగరేణి అధికారులను పిలిచి చర్చించారు.
  
భూనిర్వాసితుల వాదన... 
మణుగూరు ఓసి ప్రాజెక్టు క్రింద మాకు 23 ఎకరాల 24 గుంటల పట్టాభూమి ఉన్నది. సంబంధిత పత్రాలు మాదగ్గర ఉండగానే ప్రభుత్వం సింగరేణికి ఎలా అప్పగిస్తుందన్నారు. రెవెన్యూ అ«ధికారులు తమ ఇష్టం వచ్చినట్లు రికార్టులు రాసి పట్టా భూమిని ప్రభుత్వ భూమి అని తప్పుడు రికార్డులు రాయడం జరిగిందన్నారు. మా భూమలను ఎవరికి ఇవ్వకుండానే సింగరేణి యాజమాన్యం తమ పంట పొలాలలో పనులు ఎలా ప్రారంభిస్తుందని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగితే పట్టించుకున్నవారే లేరన్నారు. తమ భూములను ఎవరికి ఇవ్వం.. మా భూములలో పనులు నిర్వహించ వద్దని తేల్చి చెప్పారు. దీనికి తోడు 22 మంది గిరిజనులకు సంబంధించి జేసీ రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామని ఇప్పుడు రూ.5 లక్షల చెల్లిస్తామంటున్నారని మా భూములు కూడా సింగరేణి యాజమాన్యానికి ఇవ్వం.. పనులు నిర్వహించ వద్దని తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే సింగరేణి యాజమాన్యం తమకు సంబందం లేదన్నట్లుగా పనులు ఎలా నిర్వహిస్తుందన్నారు. తమ సమస్య తేలే వరకు పనులు నిర్వహించ వద్దని, నిర్వహిస్తే పనులను అడ్డుకుంటామన్నారు. స్థానిక తహసీల్దార్‌ తమ సమస్యను వినిపించుకోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. తమ పొలాల్లో పనులు ఎలా నిర్వహిస్తారో చేస్తామని అక్కడి నుంచి నిర్వాసితులు లేచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో దొబ్బల నర్సింహారావు, సీతమ్మ, వెంకటప్పయ్య, మంగమ్మ, ప్రమీల, వాసు, ఈరెల్లి కోటయ్యలతో పాటు  సుమారుగా 22 మంది భూనిర్వాసితులు పాల్గొన్నారు 

సింగరేణి అధికారుల వివరణ 
తహసీల్దార్‌ కార్యాలయానికి విచ్చేసిన సింగరేణి ఎస్వోటు జీఎం ఎం సురేష్, ప్రాజెక్టు అధికారి లలిత్‌ కుమార్, ఎస్టేట్‌ అధికారి ఉషారాణి, సెక్యురిటీ అధికారి నాగేశ్వర్‌రావు భూమి వ్యవహారం మా పరిధిలోనిది కాదు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నవేధికల ప్రకారం పరిహారం వారికి చెల్లించారు. ఏదైనా ఎంటే వారు రెవెన్యూ అధికారులతో మాట్లాడాలి కాని పనులు అడ్డంగించడం సరైన పనికాదు. 

పనులు అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు 
నిర్వాసితుల సమస్యలను తెలుకుందామనే పిలిపించాను. వారు మాకు సరిగా సహకరించడం లేదు. నేను విధులలో హాజరై 8 నెలలు అవుతుంది. పూర్తి వివరాలను పరిశీలించాల్సి ఉంది. కోర్టునుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆరు వారాల్లో రికార్డుల వివరాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తాను. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అలా అని ప్రతీ సారి ఇష్టం వచ్చినప్పుడల్లా సింగరేణి పనులను అడ్డగిస్తే చట్టపరమైన చర్యలు తీసకుంటాం. ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.   

 – మణుగూరు తహసీల్దార్,  నాగప్రసాద్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement