14 శాతం తగ్గిన సైయంట్ నికర లాభం | Sakshi
Sakshi News home page

14 శాతం తగ్గిన సైయంట్ నికర లాభం

Published Fri, Jan 15 2016 1:15 AM

14 శాతం తగ్గిన సైయంట్ నికర లాభం - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసుల రంగంలో ఉన్న సైయంట్ కు 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 13.9 శాతం తగ్గి రూ.86.8 కోట్లకు వచ్చి చేరింది. నిర్వహణ లాభం 4.8 శాతం తగ్గి రూ.110 కోట్లుగా ఉంది. ఆదాయం 9.8 శాతం ఎగసి రూ.782 కోట్లకు చేరింది. ఫ్రీ క్యాష్ ఫ్లో రూ.121 కోట్లను నమోదు చేసింది.
 
  కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. డిసెంబరు క్వార్టర్‌లో కొత్తగా 24 కంపెనీలు క్లయింట్ల జాబితాలో వచ్చి చేరాయి. అన్ని ప్రాంతాల్లో పనిదినాల తగ్గింపు, క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో సామర్థ్యం తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆదాయంపై ఒత్తిడి పడిందని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement