క్షీణించిన రూపాయి  | Sakshi
Sakshi News home page

క్షీణించిన రూపాయి 

Published Fri, Jun 8 2018 1:04 AM

20 paise down compared with the dollar - Sakshi

ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల ర్యాలీతో.. రూపాయి మారకం విలువ క్షీణించింది. గురువారం డాలర్‌తో పోలిస్తే 20 పైసలు తగ్గి 67.12 వద్ద క్లోజయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను పెంచిన ప్రభావంతో ఫారెక్స్‌ మార్కెట్లో సాధారణంగానే కొంత ఒడిదుడుకులు నెలకొనగా.. ఒక్కసారిగా ముడిచమురు ధరలు కూడా పెరగడంతో దేశీ కరెన్సీ.. నెల రోజుల గరిష్ట స్థాయి నుంచి క్షీణించింది. చమురు దిగుమతులపై ఆధారపడిన దేశం కావడంతో.. క్రూడాయిల్‌ రేట్లు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై సహజంగానే ప్రతికూల ప్రభావం పడుతుందన్న సంగతి తెలిసిందే.

బుధవారం డాలర్‌తో పోలిస్తే నెల రోజుల గరిష్ట స్థాయి 66.92 వద్ద రూపాయి మారకం విలువ క్లోజయ్యింది. కానీ ఆ తర్వాతి పరిణామాలతో గురువారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ ఒకింత బలహీనంగా 66.93 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో కనిష్ట స్థాయి 67.15కి కూడా క్షీణించింది. చివరికి 20 పైసల (0.30 శాతం) తగ్గుదలతో 67.12 వద్ద ముగిసింది. 

Advertisement
Advertisement