ప్రతి భారతీయుడి దగ్గర ఉండాల్సిన 20 యాప్స్‌ | Sakshi
Sakshi News home page

ప్రతి భారతీయుడి దగ్గర ఉండాల్సిన 20 యాప్స్‌

Published Wed, Jul 4 2018 11:06 AM

20 Useful Government Apps Every Indian Should Download - Sakshi

న్యూఢిల్లీ : డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ తదుపరి ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పలు యాప్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో 20 ప్రభుత్వ యాప్స్‌ తప్పసరిగా ప్రతి ఒక్క భారతీయుడు వాడాల్సి వస్తుందని ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌ గాడ్జెట్స్‌నౌ రిపోర్టు చేసింది. అవేమిటో ఓసారి చూద్దాం..

ఇండియన్‌ పోలీసు ఆన్‌ కాల్‌ యాప్‌ : సమీపంలో పోలీసు స్టేషన్‌ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జిల్లా కంట్రోల్‌రూం, ఎస్పీ ఆఫీసు నెంబర్లను కూడా అందిస్తుంది. 

ఈపాఠశాల యాప్‌ : ఎన్‌సీఈఆర్‌టీ ఈ-బుక్స్‌ను ఈ యాప్‌ ఆఫర్‌ చేస్తుంది. హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ, ఎన్‌సీఈఆర్‌టీ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. మొబైల్‌ ఫోన్‌లోనే విద్యార్థులకు, టీచర్లకు ఈ-బుక్స్‌ను అందిస్తుంది.

ఎంపరివాహన్‌ యాప్‌ : మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ డిజిటల్‌ కాపీని ఇది క్రియేట్‌ చేస్తుంది. కారు రిజిస్ట్రేషన్‌ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. సెకండ్‌-హ్యాండ్‌ కారు కొనుగోలు చేద్దామనుకునే వారికి ఈ యాప్‌ ఆ కారు వయసు, రిజిస్ట్రేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

స్టార్టప్‌ ఇండియా : స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను తెలుసుకోవచ్చు. 

డిజిసేవక్‌ యాప్‌ : పలు ప్రభుత్వ రంగ పనులకు వాలంటీర్‌ సర్వీసులు అందజేయడానికి ప్రజలకు అనుమతిస్తోంది.  

జీఎస్టీ రేటు ఫైండర్‌ : ఇప్పటికీ జీఎస్టీ రేట్లు గురించి అయోమయంలో ఉన్నారా? అయితే జీఎస్టీ రేటు ఫైండర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలట. పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్‌ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఉమాంగ్‌ యాప్‌ : అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకు రావడంతో ఈ యాప్‌ ఎంతో కీలకం. ఆధార్‌, డిజిలాకర్‌, పేగవర్న్‌మెంట్‌ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది.

ఇంక్రిడెబుల్‌ ఇండియా యాప్‌ : ఇది ప్రభుత్వ టూరిజం యాప్‌. టూర్‌ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్‌ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను అందిస్తుంది.

ఎంపాస్‌పోర్టు : పాస్‌పోర్టు అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాకింగ్‌, పాస్‌పోర్టు సేవ కేంద్ర లొకేషన్‌ వంటి పలు సేవలను ఈ యాప్‌ ఆఫర్‌ చేస్తుంది.

ఎంఆధార్‌ యాప్‌ : ఎంఆధార్‌ యాప్‌ అనేది మరో ఉపయోగకర యాప్‌. ఇది కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్‌ గుర్తింపును స్మార్ట్‌ఫోన్లలో తీసుకెళ్లడానికి ఈ యాప్‌ సహకరిస్తుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆధార్‌ ప్రొఫైల్‌ను షేర్‌ చేయవచ్చు, చూసుకోవచ్చు. 

పోస్ట్‌ఇన్ఫో : పార్సిల్స్‌ను ట్రాక్‌ చేయడం, పోస్ట్‌ ఆఫీసు సెర్చ్‌, పోస్టేజ్‌ కాల్యుకేటర్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం కాల్యుకేటర్‌, ఇంటరెస్ట్‌ కాల్యుకేటర్‌ వంటి సౌకర్యాలను ఇది ఆఫర్‌ చేస్తుంది. ఈ యాప్‌ ద్వారానే పోస్టులలో కట్టే ఇన్సూరెన్స్‌ పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. 

మైగవ్‌ : మంత్రిత్వ శాఖలకు, దాని సంబంధిత సంస్థలకు ఐడియాలను, కామెంట్లను, సూచనలను ఇవ్వడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. విధాన రూపకల్పనలో, ప్రొగ్రామ్‌ అమలులో కూడా ఈ యాప్‌ ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. 

మైస్పీడ్‌(ట్రాయ్‌) : మీ డేటా స్పీడ్‌ను కొలిచేందుకు, ఆ ఫలితాలను ట్రాయ్‌కు పంపించేందుకు ఉపయోగపడుతుంది.

ఎంకవాచ్‌(మొబైల్‌ సెక్యురిటీ సొల్యుషన్స్‌) :  మొబైల్‌ ఫోన్లకు చెందిన ప్రమాదాలను గుర్తించడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌ : మీ నగరం, దాని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేందుకు ఈ యాప్‌ సహకరిస్తుంది. ప్రజా సమస్యలకు సంబంధించిన ఫోటోలను క్లిక్‌ చేసి, సంబంధిత మున్సిపల్‌ అథారిటీలకు పంపించవచ్చు. అన్ని అర్బన్‌ లోకల్‌ బాడీలకు, ఈ యాప్‌కు లింక్‌ ఉంటుంది. 

భీమ్‌ : యూపీఐ పేమెంట్‌ అడ్రస్‌లను, ఫోన్‌ నెంబర్లను, క్యూఆర్‌ కోడ్‌లను వాడుతూ నగదును పంపించడానికి, పొందడానికి యూజర్లకు ఈ యాప్‌ సహకరిస్తుంది. అన్ని దిగ్గజ భారతీయ బ్యాంకులు యూపీఐతో లింక్‌ అయి ఉన్నాయని, దీంతో ఈ లావాదేవీలు కుదురుతున్నాయి. 

ఐఆర్‌సీటీసీ : అత్యంత పాపులర్‌ ప్రభుత్వ యాప్‌లలో ఇదీ ఒకటి. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌గా బుక్‌ చేసుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌తో ఇది ఇంటిగ్రేట్‌ అయింది. 

ఆయ్‌కార్‌ సేథు : ఆదాయపు పన్ను విభాగానికి చెందిన పలు సర్వీసులను అందజేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లోనే పన్నులు చెల్లించడం, ఆన్‌లైన్‌ పాన్‌ దరఖాస్తు చేసుకోవడం, పన్ను కాల్యుకేటర్‌కు ఇది ఎంతో సహకరిస్తుంది.

కిసాన్‌ సువిధ యాప్‌ : వాతావరణ అప్‌డేట్లు, పంటల మార్కెట్‌ ధరలు తెలుసుకోవడం కోసం వ్యవసాయదారులకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement