7300 దిగువకు నిఫ్టీ.. రెండో రోజూ నష్టాలే.. | Sakshi
Sakshi News home page

7300 దిగువకు నిఫ్టీ.. రెండో రోజూ నష్టాలే..

Published Wed, Feb 10 2016 1:03 AM

7300 దిగువకు నిఫ్టీ.. రెండో రోజూ నష్టాలే..

♦ 266 పాయింట్ల నష్టంతో 24,021కు సెన్సెక్స్
♦ 89 పాయింట్ల నష్టంతో 7,298కు నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో మంగళవారం మన స్టాక్ మార్కెట్‌కు  నష్టాలు తప్పలేదు. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టాల పాలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు పడిపోగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 24 వేల పాయింట్ల దిగువును తాకింది. సెన్సెక్స్ 266 పాయింట్లు క్షీణించి 24,021 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,298 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. యెన్ బలపడతుండటంతో జపాన్ నికాయ్ సూచీ మూడేళ్ల కనిష్ట స్థాయికి(5.5 శాతం నష్టం) పడిపోవడం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తి లేకపోవడం, ఐటీ దిగ్గజం కాగ్నిజంట్  రెవెన్యూ గెడైన్స్‌ను తగ్గించిన నేపథ్యంలో ఐటీ షేర్లు నష్టపోవడం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీల ఫలితాలు నిరాశకు గురిచేయడం ప్రతికూల ప్రభావం చూపాయి.  జీడీపీ సానుకూల అంచనాలు ప్రభావం చూపలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement