సత్తా ఉన్న ఇంజనీర్లు 5 శాతంలోపే.. | Sakshi
Sakshi News home page

సత్తా ఉన్న ఇంజనీర్లు 5 శాతంలోపే..

Published Fri, Apr 21 2017 1:06 AM

సత్తా ఉన్న ఇంజనీర్లు 5 శాతంలోపే..

► 95 శాతం మంది ఇంజనీర్లు ప్రోగ్రామింగ్‌ జాబ్స్‌కి పనికిరారు
► యాస్పైరింగ్‌ మైండ్స్‌ సర్వే


న్యూఢిల్లీ: భారత్‌ అంటే ఐటీ.. ఐటీ అంటే భారత్‌ అని గొప్పగానే చెప్పుకుంటుంటాం. మన దేశం నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారు అయితే ఏకంగా దిగ్గజ టెక్‌ కంపెనీలకు బాస్‌లుగా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఐటీ, డేటా సైన్స్‌ విభాగాల్లో నైపుణ్యాల కొరత చాలా స్పష్పంగా కనిపిస్తోంది.

భారత్‌లోని 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు పనికిరారని తాజాగా ఎంప్లాయబిలిటీ అసెస్‌మెంట్‌ కంపెనీ యాస్పైరింగ్‌ మైండ్స్‌ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్‌కు సరైన కోడ్‌ రాయగలుగుతున్నారు. ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ జాబ్‌కి కావలసిన కనీస అర్హత ఇది.

సర్వే ప్రకారం.. 500కుపైగా కాలేజీలకు చెందిన 36,000 మందికిపైగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆటోమేటా టెస్ట్‌ను (దీని ద్వారా అభ్యర్థి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను అంచనా వేస్తారు) ఎదుర్కొంటే వారిలో 60% మంది కోడ్‌ను రాయలేకపోతున్నారు. కేవలం 1.4% మంది మాత్రమే సమర్థవంతమైన కోడ్‌ను రాస్తున్నారు. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాల కొరత ఐటీ, డేటా సైన్స్‌ విభాగాలను బాగా ప్రభావితం చేస్తోందని, ప్రపంచం ప్రోగ్రామింగ్‌లో దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయామని యాస్పైరింగ్‌ మైండ్స్‌ సీటీవో, సహ వ్యవస్థాపకుడు వరుణ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement