ఈసారి 7.4 శాతం వృద్ధి రేటు | Sakshi
Sakshi News home page

ఈసారి 7.4 శాతం వృద్ధి రేటు

Published Fri, Jul 21 2017 12:45 AM

ఈసారి 7.4 శాతం వృద్ధి రేటు

భారత్‌పై అంచనాలను
యథాతథంగా ఉంచిన ఏడీబీ

న్యూఢిల్లీ: గతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్‌ ముందుకెళుతోందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది.

ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది. 2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017–18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018–19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

Advertisement
Advertisement