‘భర్తకు దూరంగా ఎలా ఉంటున్నారు’

15 May, 2019 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ : మహిళ పైలెట్‌ను వేధింపులకు గురి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ సినీయర్‌ కెప్టెన్‌పై ఎయిర్‌ ఇండియా యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సదరు సీనియర్‌ కెప్టెన్‌ తనను ఇబ్బందికర ప్రశ్నలతో వేధించినట్లు మహిళా పైలెట్‌ ఫిర్యాదు చేసింది. దాంతో ఆ కెప్టెన్‌పై విచారణకు ఆదేశించాం’ అని తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఈ నెల 5వ తేదీని ట్రెయినింగ్‌ సెషన్‌ పూర్తయిన తర్వాత సదరు కెప్టెన్‌ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. గతంలో నేను అతనితో కలిసి పని చేశాను. ఆ కారణంగా డిన్నర్‌కు వెళ్లేందుకు అంగీకరించాను. తొలుత అతను మర్యాదగానే ప్రవర్తించాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం’ అన్నారు.

‘అక్కడ నుంచి నన్ను వేధించడం ప్రారంభించాడు. తన వివాహ జీవితంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అంతటితో ఊరుకోక భర్తకు దూరంగా ఉంటున్నారు.. మీకు ఏం అనిపించడం లేదా అని పలు అభ్యంతరకర ప్రశ్నలు ​అడుగుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు. దాంతో నాకు చిరాకు పుట్టి.. మీతో ఇవన్ని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను’ అని సదరు మహిళా పైలెట్‌ తెలిపారు. అతడు నన్ను నైతికంగా అవమానించాడు. ఆ కెప్టెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు