Sakshi News home page

పసిడి.. యథాతథ స్థితి..!

Published Mon, Oct 26 2015 12:53 AM

పసిడి.. యథాతథ స్థితి..!

పసిడి గడచిన వారంలో దాదాపు స్థిరంగా ఉంది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాములు 24, 22 క్యారెట్ల ధరలను చూస్తే... రూ.27,005, రూ.26,855 వద్ద ముగిశాయి. వెండి ధర కేజీ రూ.37,630 వద్ద ముగిసింది. శనివారం మార్కెట్‌కు సెలవు. అయితే శనివారం పనిచేసిన ఢిల్లీసహా పలు బులియన్ స్పాట్ మార్కెట్‌లలో ధరలు  దాదాపు రూ.100కుపైగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ముంబైలో వారంవారీగా ధర చూస్తే... క్రితం శనివారం అంటే... 17వ తేదీన 10 గ్రాములు 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా.. రూ.27,015, రూ.26,865 వద్ద ముగిశాయి. వెండి ధర కేజీకి రూ.37,670 వద్ద ముగిసింది.

ఈ లెక్కన ఇక్కడ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే మిగిలిన నగరాల మార్కెట్లలో దాదాపు వారంలో రూ.100 వరకూ తగ్గింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. పండుగల సీజన్ అయినప్పటికీ... అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. డాలర్ ర్యాలీ న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజీపై ప్రభావం చూపింది. ఈ ఎక్స్ఛేంజీలో ఔన్స్ (31.గ్రా) బంగారం ధర వారంలో భారీగా 25 డాలర్ల వరకూ పడింది.  ధర 1,192 డాలర్ల నుంచి రూ.1,166 డాలర్లకు తగ్గింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగి 16 డాలర్ల వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement