ఆంధ్రాబ్యాంక్ రూ. 800 కోట్ల నిధుల సేకరణ | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ రూ. 800 కోట్ల నిధుల సేకరణ

Published Sat, Feb 20 2016 1:19 AM

ఆంధ్రాబ్యాంక్ రూ. 800 కోట్ల నిధుల సేకరణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ మూలధన అవసరాల కోసం బాండ్ల రూపంలో రూ.800 కోట్ల నిధులు సేకరించింది. బాసెల్ 3 నిబంధనల ప్రకారం టైర్1 క్యాపిటల్ 10.95% చేరుకోవడం కోసం ఈ నిధులను సేకరించినట్లు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మూడో త్రైమాసికంలో భారీగా నిరర్థక ఆస్తులు పెరగడం, వచ్చే త్రైమాసికంలో కూడా ఎన్‌పీఏలు పెరిగే అవకాశం ఉండటంతో పెరపచ్యువల్ బాండ్స్ జారీ చేయడం ద్వారా ఈ నిధులను సేకరించింది. ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ బాండ్ ఇష్యూ పూర్తిస్థాయిలో సబ్‌స్క్రైబ్ అయ్యిందని, దీంతో ఇష్యూని ఫిబ్రవరి 19తో ముగించినట్లు బ్యాంకు తెలిపింది. త్వరలోనే ఈ బాండ్లను వారి డీమ్యాట్ అకౌంట్స్‌కు జమ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement