"ఆండ్రాయిడ్ ఎన్" కు తియ్యటి పేరు | Sakshi
Sakshi News home page

"ఆండ్రాయిడ్ ఎన్" కు తియ్యటి పేరు

Published Fri, Jul 1 2016 12:35 PM

"ఆండ్రాయిడ్ ఎన్" కు తియ్యటి పేరు - Sakshi

న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూ తియ్యటి పదార్థాన్నే పేరుగా ఎంచుకుందట.  తన అప్ కమింగ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఎన్ ను "ఆండ్రాయిడ్ నోగట్" గా నామకరణం చేసింది. యూరప్ లోని ప్రముఖ స్వీట్ పేరు నోగట్. ఈ విషయాన్ని గురువారం గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ వెర్షన్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్‌ ఐకాన్‌ను కంపెనీ విడుదలచేసింది. ఇప్పటివరకూ కిట్ కాట్, లాలీపాప్, మార్ష్ మాలో వంటి ఐస్ క్రీమ్, చాక్లెట్ పేర్లతో అలరించిన గూగుల్, తన కొత్త వెర్షన్ కు కూడా తియ్యటి పదార్థాన్నే పేరుగా పెట్టాలనుకుంది.

దీనికోసం ఆన్ లైన్ లో ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటుచేసి యూజర్ల సలహాలను స్వీకరించింది. గత కొన్ని నెలలుగా యూజర్ల నుంచి వచ్చిన సలహాల మేరకు యూరప్ లోని ప్రముఖ స్వీట్ అయిన నోగట్ ను తన తాజా వెర్షన్ కు నామకరణం చేసింది. దీంతో ఆండ్రాయిడ్ ఎన్ పేరు.. ఆండ్రాయిడ్ నోగట్ గా మారింది.  తన కొత్త వెర్షన్ కు స్వీట్ స్వీట్ పేర్లును పంపించిన యూజర్లలందరికీ గూగుల్ కృతజ్క్షతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ అప్ కమింగ్ వెర్షన్ తో ఒకే విండో పై మల్టిపుల్ యాప్స్ సపోర్టు చేసేలా కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. నెక్షస్ డివైజ్ లన్నింటిలో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో రెండు యాప్ లను ఒకేసారి యూజర్లు విండోలపై తెరుచుకునేలా ఆండ్రాయిడ్ నోగట్ సహకరించనుంది.
 

Advertisement
Advertisement