స్మార్ట్ వాచ్ సమాచారం స్మార్ట్ గా.. | Sakshi
Sakshi News home page

స్మార్ట్ వాచ్ సమాచారం స్మార్ట్ గా..

Published Tue, Apr 19 2016 7:08 PM

స్మార్ట్ వాచ్ సమాచారం స్మార్ట్ గా.. - Sakshi

మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్.. ఇది కంపెనీ వ్యక్తిగత సమాచారం షేరింగ్‌తోపాటు, మెయిల్స్, క్యాలెండర్, కాంటాక్టు మేనేజర్, జర్నల్స్ ప్రతీది వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు వచ్చిన ఓ సరికొత్త ఆవిష్కరణ. దాదాపు అన్నీ మొబైల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్న ఈ అవుట్‌ లుక్ ఇక నుంచి ఆండ్రాయిడ్ చేతి వాచ్‌లలో లభ్యంకానుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఓ యాప్‌ను రూపొందించారు.

ఆండ్రాయిడ్ వేర్‌లకు అనుకూలంగా మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ ఆండ్రాయిడ్ యాప్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ తాజా అప్ డేట్‌తో స్మార్ట్ వాచ్‌లకు సంబంధించిన సమాచారమంతా ఆండ్రాయిడ్ యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఎక్కువ నైపుణ్యమున్న వెర్షన్లతో అన్నీ మొబైల్ ప్లాట్‌ఫాంలకి ఈ సాఫ్ట్ వేర్ సూట్ అందుబాటులో ఉండటంతో పాటు, భవిష్యత్తులో ధరించే వస్తువులకు దీన్ని అధికంగా ఉపయోగించనున్నారు. గూగుల్‌ప్లే(ఆండ్రాయిడ్), యాప్ స్టోర్‌ల్లో ఈ మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ అప్లికేషన్ లభ్యంకానుంది.

Advertisement
Advertisement