ఇన్ఫీకి మరో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌ బై

8 Jan, 2019 11:58 IST|Sakshi

సాక్షి,బెంగళూరు: దేశీయ రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ  ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్‌ అధికారి ఒకరు గుడ్‌  బై చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సంస్థకు సేవలందించిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ సుదీప్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా  చేశారు. ఇన్ఫోసిస్ ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్‌​ సర్వీసెస్‌  గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ తాజాగా సంస్థను వీడారు. అయితే,  సింగ్ నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫీ ప్రతినిధి నిరాకరించారు. 

కాగా గత సంవత్సరం జనవరిలో యూరోప్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ కృష్ణమూర్తి, అక్టోబర్‌లో గ్లోబల్ హెడ్ కెన్ టూమ్స్, అంతకుముందు, కంపెనీ సీవోవోగా ఉన్న రంగనాథ్‌  ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు