రేటు తగ్గింపు వరుసలో మరో రెండు బ్యాంకులు | Sakshi
Sakshi News home page

రేటు తగ్గింపు వరుసలో మరో రెండు బ్యాంకులు

Published Sat, Oct 8 2016 1:30 AM

రేటు తగ్గింపు వరుసలో మరో రెండు బ్యాంకులు

ఓబీసీ, యూబీఐల ప్రకటన

న్యూఢిల్లీ:  మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలిచాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు తమ ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వేర్వేరుగా చూస్తే..

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) కొన్ని మెచ్యూరిటీలకు సంబంధించి రేటును 0.15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆరు నెలల రుణ రేటు 0.10 శాతం తగ్గి 9.30 శాతానికి చేరింది. అక్టోబర్ 10 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తాయని వివరించింది.

యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం తగ్గించింది. అక్టోబర్ 17 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని వివరించింది. దీని ప్రకారం వార్షిక రుణ రేటు 9.45 శాతం నుంచి 9.40 శాతానికి తగ్గుతుంది. ఆరు నెలల రుణ రేటు 9.40 శాతం నుంచి 9.35 శాతానికి పడింది.

ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లు తగ్గించాయి.

Advertisement
Advertisement