యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం 16శాతం క్షీణత | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం 16శాతం క్షీణత

Published Wed, Jul 26 2017 12:13 AM

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం 16శాతం క్షీణత

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన క్వార్టర్లో 16 శాతం క్షీణించి రూ. 1,556 కోట్ల నుంచి రూ. 1,306 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు ఆదాయం రూ. 13,852 కోట్ల నుంచి రూ. 14,052 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 2016 జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే తాజా త్రైమాసికంలో భారీగా 2.54 శాతం నుంచి 5.03 శాతానికి పెరిగాయి.

నికర ఎన్‌పీఏలు 1.06 శాతం నుంచి 2.30 శాతానికి ఎగిశాయి. విలువపరంగా స్థూల ఎన్‌పీఏలు రూ. 9,553 కోట్ల నుంచి రూ. 22,030 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.4,010 కోట్ల నుంచి రూ. 9,766 కోట్లకు చేరాయి. ముగిసిన త్రైమాసికంలో అదనంగా రూ. 3,519 కోట్ల స్థూల ఎన్‌పీఏలు ఏర్పడ్డాయని, రూ. 2,462 కోట్ల మేర రైటాఫ్‌లు చేసినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,117 కోట్ల నుంచి రూ. 2,342 కోట్లకు పెరిగాయి. టెలికం, ఇన్‌ఫ్రా, ఇనుము, ఉక్కు, విద్యుత్‌ రంగాలకు ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని 1 శాతం మేర పెంచినట్లు బ్యాంకు తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement