ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన విభాగాల్లో

8 Jan, 2016 01:19 IST|Sakshi
ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన విభాగాల్లో

బజాజ్ మోటార్‌సైకిల్స్ హవా
 హైదరాబాద్
: ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన మార్కెట్ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ బజాజ్ మోటార్‌సైకిల్స్‌ప్రకటించింది. సీటీ-100, ప్లాటినం వంటి బైక్స్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో తమ ఎంట్రీ విభాగం మార్కెట్ వాటా 23 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త అవెంజర్, పల్సర్ ఆర్‌ఎస్ 200, పల్సర్ ఏఎస్ 200 వంటి తదితర బైక్స్ ఆవిష్కరణ వల్ల నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో కంపెనీ మార్కెట్ వాటా రూ.లక్ష లోపు స్పోర్ట్స్ వాహన విభాగంలోనూ 53 శాతానికి చేరినట్లు పేర్కొంది. ఎంట్రీ, స్పోర్ట్స్ విభాగాల వాటా మొత్తం పరిశ్రమలో 43 శాతంగా ఉందని, ఇందులో తమ కంపెనీ 36 శాతం వాటాతో అగ్రపథంలో దూసుకెళ్తోందని బజాజ్ ఆటో (మోటార్‌సైకిల్స్ బిజినెస్) ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. టూవీలర్ మార్కెట్‌లో ఎంట్రీ, ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్స్ అనే మూడు విభాగాలు ఉంటాయి.
 

మరిన్ని వార్తలు