బజాజ్‌ ఆటో.. బీఎస్‌–ఫోర్‌ పల్సర్‌

7 Feb, 2017 00:53 IST|Sakshi
బజాజ్‌ ఆటో.. బీఎస్‌–ఫోర్‌ పల్సర్‌

ధర రూ.1.33 లక్షల వరకూ
న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ బీఎస్‌–ఫోర్‌(భారత్‌ స్టేజ్‌ ఫోర్‌) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే రెండు పల్సర్‌ బైక్‌ మోడళ్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆర్‌ఎస్‌ 200, ఎన్‌ఎస్‌200 పేర్లతో అందిస్తున్న ఈ మోడళ్ల ధరలు రూ.1.33 లక్షల వరకూ (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని బజాజ్‌  ఆటో తెలిపింది. పల్సర్‌ ఆర్‌ఎస్‌200 మోడల్‌ ఏబీఎస్‌(యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌) ఫీచర్‌తో, ఏబీఎస్‌ ఫీచర్‌ లేకుండానూ లభిస్తుందని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ మోటార్‌ సైకిల్‌ బిజినెస్‌ ఎరిక్‌ వాస్‌ తెలిపారు.

ఏబీఎస్‌ ఫీచర్‌ ఉన్న బైక్‌ ధర రూ.1.33 లక్షలని, ఏబీఎస్‌ ఫీచర్‌ లేని బైక్‌ ధర రూ.1.22 లక్షలని పేర్కొన్నారు. ఇక పల్సర్‌ ఎన్‌ఎస్‌200 మోడల్‌ ధరలు రూ.96,453 నుంచి మొదలవుతాయని తెలిపారు. ఆర్‌ఎస్‌200 బైక్‌లో ఏబీఎస్, ఫ్యూయల్‌ ఇంజెక్షన్, లిక్విడ్‌ కూలింగ్, పెరిమీటర్‌ ఫ్రేమ్, ట్విన్‌ ప్రాజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ తదితర అత్యున్నత సాంకేతిక ఫీచర్లున్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు