బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముద్రాకార్డ్ | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముద్రాకార్డ్

Published Sat, Sep 19 2015 1:59 AM

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముద్రాకార్డ్ - Sakshi

 హైదరాబాద్ : సూక్ష్మ, చిన్న పరిశ్రమల రుణ అవసరాలు తీర్చడం లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముద్రాకార్డ్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్ 81 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జోనల్ మేనేజర్ ఎన్ రాంబాబు ఈ కార్డును ఆవిష్కరించారు. రూ.10 లక్షల వరకూ రుణ అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముద్రా స్కీమ్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  బేస్‌రేటుకే, ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా  రూ.5 లక్షల వరకూ రుణాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫర్ చేస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement