భెల్ లాభం తగ్గింది | Sakshi
Sakshi News home page

భెల్ లాభం తగ్గింది

Published Wed, May 27 2015 12:37 AM

భెల్ లాభం తగ్గింది

ఒక్కో షేర్‌కు రూ.0.62 డివిడెండ్
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్ నికర లాభం(స్టాండ్‌లోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 52% తగ్గింది. 2013- 14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,845 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.888 కోట్లకు తగ్గిందని భెల్ పేర్కొం ది. నికర అమ్మకాలు రూ.14,755 కోట్ల నుంచి 16% క్షీణించి రూ.12,368 కోట్లకు పడిపోయాయని తెలిపింది. 31% డివిడెండ్(ఒక్కో షేర్‌కు రూ.0.62) ఇవ్వాలని తమ డెరైక్టర్ల బోర్డ్ రికమెండ్ చేసిందని పేర్కొంది.

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే,  2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 59% క్షీణించి రూ.1,419 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ. 38,389 కోట్ల నుంచి 23% క్షీణించి రూ.29,542 కోట్లకు తగ్గాయి.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భెల్ షేరు ధర మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 2.8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement