మార్కెట్‌కు బడ్జెట్‌ దిశానిర్దేశం | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు బడ్జెట్‌ దిశానిర్దేశం

Published Sun, Jan 29 2017 11:55 PM

మార్కెట్‌కు బడ్జెట్‌ దిశానిర్దేశం

జైట్లీ బడ్జెట్‌పై భారీగా అంచనాలు
► కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు  పీఎంఐ గణాంకాలపై దృష్టి
►  ఈ వారం గమనంపై నిపుణులు...


నిర్దేశిస్తాయకేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసే ప్రకటనలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని ని నిపుణులంటున్నారు. ఈ వారం వెలువడనున్న కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు, తయారీ రంగానికి సంబంధించి జనవరి నెల గణాంకాలు,   విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం .. తదితర అంశాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు.

బడ్జెట్‌లో తాయిలాలు...
వచ్చే నెల 1, బుధవారం రోజు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అంతకు ముందు రోజు, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు, మంగళవారం (ఈ నెల31న) ఆర్థిక సర్వే వివరాలను వెల్లడిస్తారు. తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను కూడా బడ్జెట్‌లో భాగంగానే ప్రకటిస్తారు. ఈ సారి బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.4 లక్షలకు పెంచవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి.

పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి బడ్జెట్‌ కావడంతో నగదు రహిత లావాదేవీల జోరు పెంచేందుకు కొన్ని తాయిలాలు ఇవ్వోచ్చని పలువురు భావిస్తున్నారు.  ఇక ఈ సారి బడ్జెట్లో  రైల్వేలకు, రక్షణ రంగానికి భారీగా నిధుల కేటాయింపు  ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇది క్యాపిటల్‌ గూడ్స్‌ రంగానికి జోష్‌నిస్తుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని, ఎక్సైజ్‌ సుంకాలను కూడా తగ్గించాలని వాహన కంపెనీలు కోరుతున్నాయి. ఫలితంగా వాహనాలకు డిమాండ్‌ పెరిగి అమ్మకాలు పుంజుకోగలవని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. విద్యుత్‌ రంగానికి రాయితీలు, జీఎస్‌టీ అమలుపై స్పష్టత, బొగ్గుపై సెస్‌ తగ్గింపు, కార్పొరేట్‌ పన్ను రేట్ల తగ్గించవచ్చని అంచనా.

కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు
ఇక పలు కంపెనీలు ఈ వారంలోనే  హెడ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా,  గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్,  బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్ జీసీ, క్యాడిలా హెల్త్‌కేర్‌లు ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక  మార్కిట్‌ ఎకనామిక్స్‌ సంస్థ బుధవారం(ఫిబ్రవరి 1న) మన తయారీ రంగానికి సంబంధించి ఈఏడాది జనవరి గణాంకాలను, అలాగే శుక్రవారం(ఫిబ్రవరి 3న) సేవా రంగానికి సంబంధించిన గణాంకాలను వెల్లడిస్తుంది.
ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే,  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌  రెండు రోజుల సమావేశం ఈ మంగళవారం(జనవరి 31న) ప్రారంభమవుతుంది. గురువారం సమావేశ నిర్ణయాల(ద్రవ్య పాలసీ) వివరాలు వెల్లడవుతాయి. పావు శాతం రేట్ల పెంపు ఉండొచ్చన్న అంచనాలున్నాయి.

ఎందుకు పెరిగాయంటే...
నాన్ –కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్ సీడీ) ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించనున్నట్లు ప్రకటించడంతో ఐడియా షేర్‌ 12 శాతం ఎగసింది. బ్రాండ్ల కోసం ఫ్రాంచైజీ మోడల్‌ను అనుసరించాలని యునైటెడ్‌ స్పిరిట్స్‌ యోచిస్తుండడం, మరో ఓపె న్  ఆఫర్‌ను ఇవ్వాలని డియాజియో భావి స్తోందన్న మీడియా వార్తలతో యునైటెడ్‌ స్పిరిట్స్‌11% పెరిగింది. మ్యాక్స్‌ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ల విలీనానికి  ఐఆర్‌డీఏఐ త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నదన్న వార్తల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతం లాభపడింది.

ఎందుకు తగ్గాయంటే...
ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో కాల్గేట్‌  పామోలివ్‌  షేర్‌ 3% నష్టపోయింది. క్యూ3 ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడం,  ఆదాయ అంచనాలను చేరుకోలేకపోవడంతో విప్రో షేర్‌ 2% పతనమైంది. నికర లాభం భారీగా తగ్గడంతో ఈ వారం కూడా యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 2 శాతం క్షీణించింది. హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతాయనే అంచనాలతో ఇన్ఫోసిస్‌ షేర్‌ 2 శాతం నష్టపోయింది. నికర లాభం 20 శాతం పతనం కావడంతో భారతీ ఇన్ ఫ్రాటెల్‌ 2 శాతం తగ్గింది.

                                            గత వారం హీరోలు
షేర్‌                                27/01ధర              19/01 ధర    మార్పు (%)
ఐడియా సెల్యులార్‌               78                        69          12
యునైటెడ్‌ స్పిరిట్స్‌              2,270                 2,046        11
హెచ్‌డీఎఫ్‌సీ                       1,371                  1,241        10
హిందాల్కో                          191                      176           8
హెచ్‌పీసీఎల్‌                         536                      495          8
ఆర్‌ఈసీ                              150                       139          8
కోటక్‌ బ్యాంక్‌                        785                      729          8
బజాజ్‌ ఫైనాన్స్                     995                      926          7
గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌                 929                       865          7
సెయిల్‌                                64                           59          7

                                           గత వారం జీరోలు
షేర్‌                                  27/01ధర              19/01 ధర     మార్పు (%)
ఆర్‌కామ్‌                             31                           32             –4
మహీంద్రా ఫైనాన్షియల్‌         282                       293             –4
ఏబీబీ ఇండియా                1,112                  1,153              –4
దివీస్‌ ల్యాబ్‌్స                  708                          731            –3
టెక్‌ మహీంద్రా                   467                          481            –3
కోల్గేట్‌ పామోలివ్‌               881                         908             –3
విప్రో                                 466                         478            –2
యాక్సిస్‌  బ్యాంక్‌               473                        484             –2
ఇన్ఫోసిస్‌                          942                        959              –2
భారతీ ఇన్ ఫ్రాటెల్‌              353                        358             –2  

Advertisement
Advertisement