బంక్ బెడ్స్తో హుషారు | Sakshi
Sakshi News home page

బంక్ బెడ్స్తో హుషారు

Published Fri, Nov 25 2016 11:02 PM

బంక్ బెడ్స్తో హుషారు

సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు తమ పిల్లలే లోకం. అందుకే ఇంటి ఎంపికలో, అందులోని ఫర్నీచర్ విషయంలోనూ పిల్లల ఆసక్తి, అభిరుచులను కాదనట్లేదు. ఈమధ్య కాలంలో నగరంలో బంకు బెడ్‌‌స హల్‌చల్ చేస్తున్నారుు. చిన్నారులూ వాటిని ఇష్టపడుతుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది.

ఒక బెడ్ మీద మరొక బెడ్ ఉండటమే ఈ బంక్ బెడ్ ప్రత్యేకత. పెద్దలను విసిగించకుండా పడుకునేందుకు ఈ బెడ్‌‌స తోడ్పడుతుండటంతో  వీటిని కొనేందుకు తల్లిదండ్రులూ వెనకాడట్లేదు. ఇద్దరు పిల్లలున్న ఇళ్లలో వీటి పాత్ర కాసింత ఎక్కువేనని చెప్పాలి. ఇద్దరికి అతికినట్లు సరిపోయేలా గదిని డిజైన్ చేయటం వల్ల బోలెడు ప్రయోజనాలున్నారుు. ఇద్దరి పిల్లలో ప్రేమానురాగాలు పెరుగుతారుు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మేమిద్దరం ఒకటేనన్న ఆలోచన వస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

 బోలెడు రకాలు..
బంకు బెడ్లలో రకాలకు కొదవేం లేదు. మెట్లు ఉండే ట్విన్ ఓవర్ ట్విన్, ట్విన్ ఓవర్ ఫుల్, మినీ లాఫ్ట్, ఫుల్ ఓవర్ ఫుల్, లాఫ్ట్ కమ్ స్టోరేజ్ బెడ్.. ఇలా రకరకాలున్నారుు. వీటిని ఏర్పాటు చేయడానికి గది విస్తీర్ణం పెద్దగా ఉండాల్సిన అవసరమేమీ లేదు. కనీసం 10/8 చ.అ. గది సైజుంటే చాలు.

ట్విన్ ఓవర్ బెడ్ల ప్రత్యేకత ఏంటంటే.. చిన్నారులు పెద్దయ్యాక కూడా వీటిని వ్యక్తిగత బెడ్‌గా వినియోగించుకోవచ్చు. టేకుతో తయారయ్యే రకం ధర రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుంది. అదే రంగుల్లో కావాలంటే కాసింత ధరెక్కువ.

ట్విన్ ఓవర్ ఫుల్ రకం 3-6 ఏళ్ల చిన్నారులకు చక్కగా నప్పుతారుు. పైన బెడ్ మూడడుగుల వెడల్పు, కింది బెడ్ నాలుగడుల దాకా ఉంటుంది. మనకు నచ్చిన రంగుల్లో వీటిని ఎంచుకోవచ్చు. వీటి ప్రారంభ ధర రూ.45 వేలుంటుంది.

ఫుల్ ఓవర్ ఫుల్ రకం కాస్త పెద్దగా కనిపిస్తుంది. కింద, పైన నాలుగు అడుగుల చొప్పున ఉంటుంది. ధర కనీసం రూ.55 వేల నుంచి దొరుకుతారుు.

పిల్లలు కొంత పెద్దగా ఉంటే తల్లిదండ్రులు బంకు బెడ్లకే పరిమితం కావటం లేదు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చదువుకునే బల్ల, వార్డ్‌రోబ్, వస్తువులు పెట్టుకోవటానికి అరలు వంటివి కల్పిస్తున్నారు. ఇవన్నీ విదేశీ స్థారుులో చూడచక్కగా ఉంటారుు.

Advertisement
Advertisement