భారీగా తగ్గనున్న క్యాన్సర్ , బీపీ మందుల ధరలు | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గనున్న క్యాన్సర్ , బీపీ మందుల ధరలు

Published Thu, May 12 2016 4:38 PM

భారీగా తగ్గనున్న క్యాన్సర్ , బీపీ మందుల ధరలు - Sakshi


న్యూఢిల్లీ:  భారతదేశంలో సాధారణమైన ముదిరిన వ్యాధుల చికిత్సకు వాడే   మందుల ధరలను దాదాపు సగానికిపైగా  తగ్గిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  క్యాన్సర్, బీపీ, లాంటి వ్యాధిగ్రస్తులకు సరసమైన  ధరులకు మందులను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో  ఈ చర్యలకు దిగింది.   54  రకాల మందుల ధరలను 55 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

రక్తపోటు, మెదడు,  రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం , యాంటీబయాటిక్స్, గుండె వ్యాధులకు సంబంధించిన మందులు సహా 54 మందుల ధర తగ్గించాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తెలిపింది. తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు  వెల్లడించింది.
కాగా ఎన్పీపీఏ 15 రోజుల్లో  ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండవ సారి. ఏప్రిల్ 28  కొన్ని రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement