కార్‌వాలా | Sakshi
Sakshi News home page

కార్‌వాలా

Published Mon, Feb 22 2016 2:48 AM

కార్‌వాలా - Sakshi

Appకీ కహానీ...
మారుతీ సుజుకీ, మహీంద్రా, హోండా, టయోటా, టాటా, ఫోర్డ్, బీఎండ బ్ల్యూ, ఆడి, నిస్సాన్, రెనో, ఫెరారి ..ఇలా పలు కంపెనీలకు చెందిన రకరకాల మోడల్ కార్లు రోడ్ల మీద పరుగెడుతున్నాయి. ఇన్ని మోడళ్లలో కొత్తగా ఒక కారును తీసుకోవాలంటే కొంచెం కష్టమే. కారు కొనుగోలు చేసేటప్పుడు ఎన్నో రకాల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ ప్రత్యేకతలు అన్ని కంపెనీల మోడళ్లలో ఉంటాయి. అప్పుడేం చేద్దాం. ఒక కంపెనీ కారుతో మరొక కంపెనీ కారును పోల్చుకొని ఏది మంచి ఫీచర్లను కలిగి ఉందో.. దాన్ని చివరకు తీసుకుంటాం.

ఈ విధంగా కారులను ఒకదానితో మరొకదాన్ని పొల్చడానికి ‘కార్‌వాలా’ యాప్ మనకెంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
కారు ధరలను ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూసుకోవచ్చు.
కార్లకు సంబంధించిన 6 వేలకు పైగా రివ్యూలను చదవచ్చు. అలాగే వందలకు పైగా కారు రివ్యూ వీడియోలను చూడొచ్చు.
యాప్‌లో పాత కార్ల వివరాలు కూడా ఉన్నాయి.
భారత్‌లోని కార్ల సంబంధిత ఆన్‌రోడ్, ఎక్స్ షోరూమ్ ధరలను తెలుసుకోవచ్చు.
కార్లకు సంబంధించిన దేశీ, అంతర్జాతీయ వార్తలను చదవచ్చు.
కొత్త కార్లకు సంబంధించిన ఇంజిన్, మైలేజ్, డిజైన్ వంటి తదితర అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
కార్లను ధర, బ్రాండ్, ప్రత్యేకతల ఆధారంగా సెర్చ్ చేయవచ్చు.
మనకు దగ్గరలో ఉన్న డీలర్ల వివరాలను పొందొచ్చు.
నచ్చిన కార్ల వివరాలను స్నేహితులకు షేర్ చేయవచ్చు.

Advertisement
Advertisement