స్టాక్ మార్కెట్లో చైనా పెన్షన్ ఫండ్ భారీ పెట్టుబడులకు అనుమతి | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో చైనా పెన్షన్ ఫండ్ భారీ పెట్టుబడులకు అనుమతి

Published Mon, Aug 24 2015 2:35 AM

China massive investments in the stock market, the pension fund is allowed to

బీజింగ్ : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చైనా పెన్షన్ ఫండ్‌కు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 54,700 కోట్ల డాలర్ల(రూ.35,55,500 కోట్ల) విలువైన ఈ చైనా పెన్షన్ ఫండ్ ప్రపంచంలోనే అతిపెద్ద పెన్షన్ ఫండ్. జూన్, జూలై నెలల్లో నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయిన చైనా స్టాక్ మార్కెట్లో ఈ నెలలో కూడా తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్‌కు ద స్టేట్ కౌన్సిల్(చైనా క్యాబినెట్) పచ్చజెండా ఊపిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్‌హువా తెలిపింది. తన మొత్తం నిధుల్లో 30 శాతంవరకూ ఈక్విటీల్లో పెట్టుబడి చేయడానికి అనుమతి లభించింది. ఇప్పటివరకూ ఈ ఫండ్ బ్యాంకులు, బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తోంది.

Advertisement
Advertisement