భారత్ మార్కెట్‌పై చైనా ‘బైదు’ కన్ను | Sakshi
Sakshi News home page

భారత్ మార్కెట్‌పై చైనా ‘బైదు’ కన్ను

Published Thu, Jan 14 2016 2:39 AM

భారత్  మార్కెట్‌పై చైనా ‘బైదు’ కన్ను

 జొమాటో, బుక్‌మైషోల్లో వాటాలపై దృష్టి
 న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం బైదు.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెస్టారెంట్ సర్వీసుల సంస్థ జొమాటో, ఆన్‌లైన్ సినిమా టికెట్ల సేవల సంస్థ బుక్‌మైషో, ఫుడ్ రిటైలర్ బిగ్ బాస్కెట్ మొదలైన వాటిల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆక ర్షించే దిశగా తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో యాప్‌లతో తమ మొబోమార్కెట్ యాప్ స్టోర్‌ను విస్తరించాలని భావిస్తోంది.

యాప్స్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ ఆధిపత్యం నడుస్తున్న నేపథ్యంలో స్థానిక భాషల్లో యాప్స్‌ను అందించడం ద్వారా భారత్‌లో మార్కెట్ వాటా దక్కించుకోవాలని బైదు యోచిస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న భారత్ తమకు వ్యూహాత్మకంగా పెద్ద మార్కెట్  అని బైదు భారత విభాగం హెడ్ టిమ్ యాంగ్ తెలిపారు. గూగుల్ అందుబాటులో ఉండని చైనా మార్కెట్లో బైదు ఆధిపత్యం కొనసాగుతోంది.

Advertisement
Advertisement