Sakshi News home page

రోజువారీ పెట్రోల్‌ చార్జీల భారం

Published Wed, Sep 27 2017 1:10 AM

Daily fuel price revision: Petrol

న్యూఢిల్లీ: రోజువారీ పెట్రో చార్జీలను సవరించే విధానం మొదలయ్యాక ఈ ఏడాది జూన్‌ నుంచి పెట్రోలియం ధరలు 8 శాతం పెరిగినట్టు రేటింగ్‌ సంస్థ ఇక్రా తెలియజేసింది. ఇలా స్థిరంగా ధరలు పెరుగుతూ పోతే వృద్ధికి విఘాతం కలగడంతోపాటు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతాయని హెచ్చరిం చింది.

ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు 14 శాతం పెరగడంతోపాటు, దేశీయంగా పెట్రోల్‌ పంపుల డీలర్లకు కమీషన్లు పెంచడం కారణాలుగా పేర్కొంది. అంతకు ముందు లీటర్‌కు 2.55 కమీషన్‌గా ఇవ్వగా దాన్ని 40 శాతం పెంచి రూ.3.57గా చేసినట్టు తెలిపింది. జూన్‌ 17న ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.65.23గా ఉండగా, అది రూ.70.41కు చేరిన విషయాన్ని గుర్తు చేసింది.  

Advertisement

What’s your opinion

Advertisement