ఆధార్‌ లింక్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు, కానీ... | Sakshi
Sakshi News home page

ఆధార్‌ లింక్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు, కానీ...

Published Thu, Dec 7 2017 11:37 AM

Deadline For Linking Aadhaar To Be Extended To March 31 - Sakshi

న్యూఢిల్లీ : ఆధార్‌ అనుసంధానం తుది గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించే తుది గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ పొడిగింపు కేవలం ఇప్పటి వరకు ఆధార్‌ కార్డులు పొందలేని వారికేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఆధార్‌ కలిగి ఉన్నవారికి ఈ పొడిగింపు వర్తించదు.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్టు అటార్ని జనరల్‌ కేకే వేణుగోపాల్‌ నేడు సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొబైల్‌ సర్వీసులకు ఆధార్‌ను లింక్‌ చేసే తుది గడువు ఫిబ్రవరి 6తోనే ముగియనుందని అటార్ని జనరల్‌ పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్లకు, మొబైల్‌ నెంబర్లకు, ఇతర ప్రభుత్వ సర్వీసులకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement