మద్యం వ్యాపారులకు షాక్‌

30 Aug, 2019 08:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యానికి చెక్‌ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మద్యం వ్యాపారులకు షాక్‌ ఇస్తున్నాయి. ఎనిమిది రోజులకు మించి పాతబడిన మద్యం నిల్వలను ఆగస్ట్‌ 31 నుంచి ధ్వంసం చేయాలని ఢిల్లీ సర్కార్‌ స్పష్టం చేసింది. కస్టమర్లకు నాణ్యతతో కూడిన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు కల్తీ మద్యం, పాత, కొత్త ఆల్కహాల్‌ను మిక్స్‌ చేసే వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం వ్యాపారులు తరచూ గడువు ముగిసే బీర్లను పెద్దసంఖ్యలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు అందిస్తున్నారు. తొలుత కొనుగోలు చేసిన మద్యం నిల్వలను ముందుగా విక్రయించాలని బీర్‌, వైన్‌, షాంపేన్‌ వంటివి మూడు రోజుల వరకే కౌంటర్లలో ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. రూ 1500 ఖరీదు కలిగిన  విస్కీ, జిన్‌, వోడ్కా, రమ్‌, స్కాచ్‌లను ఐదు రోజుల్లోగా విక్రయించాలని, రూ 1500 నుంచి రూ 6000 విలువైన మద్యాన్ని ఎనిమిది రోజుల్లోగా అమ్మకాలు జరిపి మిగిలిన నిల్వలను ధ్వంసం చేయాలని పేర్కొంది. ఆయా గడువులోగా స్టాక్స్‌ మిగిలితే వాటిని అమ్మినట్టుగానే భావించి కౌంటర్ల నుంచి పక్కనపెట్టాలని తెలిపింది.

ఈ నిల్వలను వారం రోజుల్లో నిర్వీర్యం చేయాలని పేర్కొంటూఈ ఉత్తర్వులను పాటించని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, హోటళ్లు, డిస్కోథెక్‌ల లైసెన్లను రద్దు చేసేందుకూ ప్రభుత్వం వెనుకాడబోదని ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ గంభీర్‌ స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై పబ్‌లు, హోటల్స్‌, బార్‌ యజమానులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయంతో అవినీతి మరింత పెరుగుతుందని, మద్యం కల్తీని అరికట్టాలంటే ఎక్సైజ్‌ శాఖ తమ అవుట్‌లెట్లను తనిఖీ చేయవచ్చని ఇలా తమను టార్గెట్‌ చేయడం సరికాదని ఆర్ధర్‌ 2 పబ్‌ యజమాని సువీత్‌ కార్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రీమియం బ్రాండ్స్‌ వ్యాపారంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు ఢిల్లీ సర్కార్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, నాణ్యమైన మద్యం తమకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం వెసులుబాటు కల్పిస్తుందని థామస్‌ కుక్‌లో పనిచేసే పర్వ్‌ పేర్కొన్నారు. కల్తీ మద్యం నివారించకపోతే పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని సీనియర్‌ వైద్యులు విక్రంజిత్‌ సింగ్‌ అన్నారు. బార్లలో తరచూ పాత, కొత్త మద్యాలను మిక్స్‌ చేసి కస్టమర్లకు ఇవ్వడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పసిడి.. కొత్త రికార్డు

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

వృద్ధి బాటలో చిన్న మందగమనమే!

సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..!

భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు

సంక్షోభంలో డైమండ్‌ బిజినెస్‌

మార్కెట్ల పతనం,10950 దిగువకు నిఫ్టీ

ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!

అతిచవక ధరలో రెడ్‌మి టీవీ

కొత్త ఎఫ్‌డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌ ఫోన్లు

ఆపిల్‌ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు మూడు రోజులే గడువు

టయోటా, సుజుకీ జట్టు

సబ్బుల ధరలు తగ్గాయ్‌..

‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతి ఆయోగ్‌

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్‌

ప్రైడో క్యాబ్స్‌ వస్తున్నాయ్‌!

స్టాక్‌ మార్కెట్‌ను వీడని నష్టాలు

అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

డీటీసీతో ‘పన్ను’ ఊరట!

ఎఫ్‌డీఐ 2.0

బడ్జెట్‌ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది

నాలుగు కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు