కార్పొరేట్‌ మోసాలు పెరుగుతాయ్‌ | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ మోసాలు పెరుగుతాయ్‌

Published Thu, Dec 22 2016 1:30 AM

కార్పొరేట్‌ మోసాలు పెరుగుతాయ్‌ - Sakshi

వచ్చే రెండేళ్లలో మరింత పైకి...
డెలాయిట్‌ సర్వే నివేదిక...  


ముంబై: దేశీయంగా కార్పొరేట్‌ మోసాలు వచ్చే రెండేళ్లలో మరింత పెరగనున్నాయని గ్లోబల్‌ అకౌంటింగ్‌ దిగ్గజం డెలాయిట్‌ పేర్కొంది. నైతిక విలువలు అంతకంతకూ దిగజారుతుండమే దీనికి  ప్రధాన కారణంగా కార్పొరేట్‌ కంపెనీలు భావిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది. డెలాయిట్‌ నిర్వహించిన ‘ఇండియా ఫ్రాడ్‌ సర్వే’లో 309 కార్పొరేట్‌ కంపెనీలకు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలివీ...
నైతిక విలువలు దిగజారడమే మోసాలు పెరిగేందుకు దారితీస్తోందని సర్వేలో పాల్గొన్న బడా కంపెనీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లలో 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్‌ఎంఈ)లకు చెందిన 68 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణుల్లో 42 శాతం మంది ఇదే కారణాన్ని పేర్కొన్నారు.
అవినీతి, లంచాలు, వెండార్లకు అనుకూలంగా వ్యవహరిం చడం, స్వప్రయోజనాలు వంటివి గడిచిన రెండేళ్లలో జరిగిన కార్పొరేట్‌ మోసాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
ఒకేవిధమైన మోసాలను ఎదుర్కోవడంలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాల్లో తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. దీనిప్రకారం చూస్తే.. మోసాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. వీటికి అడ్డుకట్టవేయడంలోకంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నట్లు అవగతమవుతోంది.
పెద్ద కంపెనీల్లో చాలావరకూ అందరికీ తెలిసిన మోసాలను అరికట్టడంపైనే దృష్టిపెడుతున్నాయి. సోషల్‌ మీడియా, పోటీ కంపెనీలు అనురిస్తున్న కొత్తరకం మోసాలను ఎదుర్కోవడానికి సమాయత్తంగా లేవు.
మోసం తీవ్రత ఆధారంగానే దర్యాప్తులను మొదలుపెడుతున్నట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక మోసం చేసిన సిబ్బంది రాజీనామాకు అనుమతిస్తున్నట్లు 36 శాతం మంది వెల్లడించారు. ఇతరఉద్యోగులు, కంపెనీ బోర్డు, నియంత్రణ సంస్థలకు సబంధిత మోసం గురించిన సమాచారాన్ని అందిస్తున్నట్లు 33 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు వివరించారు.
ఎస్‌ఎంఈలకు సంబంధించి మోసాలను ఎదుర్కొనే సమాయత్తత, సంకల్పం లేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటువంటి కార్యకలాపాలను నివారించేందుకు తగిన బడ్జెట్, వనరుల కేటాయింపులేదని 42 శాతం మంది చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement